శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా దేవి అమ్మవారి అష్టమ వార్షికోత్సవాలు - 12.03.2022 నుంచి 14.03.2022

 తేదీ 12.03 2022 శనివారం నుండి 14.03.2022 సోమవారం వరకు  శ్రీ శ్రీ శ్రీ  విజయ దుర్గా  మల్లేశ్వర స్వామి దేవాలయము నందు అమ్మవారి అష్టమ వార్షికోత్సవము జరుపబడును.

 
* తేదీ 12.03.2022 రోజున అమ్మ వారికి విశేష పూజ, అభిషేకము జరుగును.

* తేదీ 13.03.2022 ఆదివారము నాడు అమ్మవారికి అభిషేకము సాయంత్రం నాలుగు గంటలకు చండీ హోమము జరుపబడును

* తేదీ 14.03.2022 సోమవారం నాడు ఉదయం 11 గంటలకు శివపార్వతుల శాంతి కళ్యాణం జరుగును మరియు తీర్థ ప్రసాదములు అన్నదాన కార్యక్రమం గలదు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు

ప్రతి రోజు సాయంత్రం కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణం మరియు మహా మంగళహారతి జరుగును.






No comments