శ్రీ సరస్వతి దేవి - Sri Saraswathi Devi - 02.10.2022 (Day 7)
ఆశ్వయుజ శుద్ధ సప్తమి 02.10.2022 ఆదివారం రోజు శ్రీ సరస్వతి దేవి గా శ్రీ విజయ దుర్గా దేవి భక్తులకు దర్శనం ఇచ్చారు. అభిషేకం, అలంకరణ, పూజాది కార్యక్రమాలు, సప్త హారతులు ఆలయ పూజారి శ్రీ జనార్ధన్ ఆచార్యులు నిర్వహించారు.
సాయంత్రం శ్రీ లలితా సహస్ర నామ పారాయణం, కుంకుమార్చన మరియు అమ్మవారికి మహా నైవేద్యం, సప్త హారతులు, మహా మంగళహారతి, చేతుర్వేద స్వస్తి, పవళింపు సేవ తీర్ధ ప్రసాద వితరణ జరిగాయి పూజా కార్యక్రమాలలో భక్తులు లో అధిక సంఖ్య పాల్గొన్నారు...
ఆలయ ప్రాగణం లో శ్రీ సునీల్ శర్మ & ఆలయ పూజారి జనార్ధన్ ఆచార్యలు ఆద్వర్యం లో చండి హోమం ఘనంగా నిర్వహించారు. యువతీ యువకులు హోమం పై కూర్చొని చండి మాతను ధ్యానించు కున్నారు.
Post a Comment